బాలయ్య సినిమాలో పాయల్ కి ఛాన్స్

  • గ్లామరస్ హీరోయిన్ గా పాయల్ 
  • మాస్ ఆడియన్స్ కి మంచి క్రేజ్ 
  •  బాలకృష్ణ సరసన సందడి షురూ  
'ఆర్ ఎక్స్ 100' .. 'ఆర్డీఎక్స్ లవ్' సినిమాలతో పాయల్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కుదిరితే కథానాయిక .. లేదంటే ఐటమ్ సాంగుకైనా రెడీ అంటూ తన జోరు చూపిస్తోంది. భారీ అందాలతో వయ్యారాలు ఒలకబోసే ఈ సుందరి ఇతర భాషా చిత్రాల దర్శక నిర్మాతల దృష్టిలో పడుతోంది.

ఈ నేపథ్యంలోనే పాయల్ కి బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కినట్టు ఒక వార్త షికారు చేస్తోంది. బాలయ్య సరసన కథానాయికలుగా శ్రియ - అంజలి పేర్లు వినిపించాయి. ఆ తరువాత శ్రియ పేరు కాస్త వినిపించడం తగ్గింది. ఇప్పుడేమో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. పారితోషికం తక్కువ .. గ్లామరస్ డోస్ ఎక్కువ కనుకనే పాయల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య - బోయపాటి సినిమాలో పాయల్ దుమ్మురేపేయనుందన్న మాట.


More Telugu News