కరోనాపై భయం వద్దు...పరిశుభ్రత పాటించండి: ఏపీ సీఎం అదనపు కార్యదర్శి రమేష్‌

  • అందరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు
  • చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి చాలు
  • జలుబు, దగ్గు వచ్చినంతనే ఆందోళన వద్దు
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, అందువల్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్‌ తెలిపారు. ఈరోజు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది వ్యక్తిగత పరిశుభ్రత అని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇందుకోసం తరచూ శానిటైజర్స్‌తో కడుక్కోవాలని సూచించారు.

భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే, కేవలం జలుబు, దగ్గు రాగానే ఆందోళన చెందవద్దన్నారు. ఆరు గంటలకోసారి పారాసిటమల్‌ మాత్రవేసుకుంటూ ఇంట్లోనే రెస్ట్‌ తీసుకుంటే కోలుకోవచ్చని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అనుమానితులు ఎవరైనా 104ను సంప్రదిస్తే మీ ఇంటికే అంబులెన్స్‌ వస్తుందని, సమీపంలోని ఆసుపత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామని చెప్పారు.


More Telugu News