ప్లీజ్... క్వారంటైన్ సెంటర్లలో వున్న వారిని చూసేందుకు ఎవరూ రావద్దు: సీపీ సజ్జనార్

  • వైరస్ కట్టడికి మేము తీసుకుంటున్న చర్యలకు సహకరించండి 
  • మీరు వచ్చి కలిసి వెళితే వైరస్ వ్యాప్తికి అవకాశం 
  • అందుకే కేంద్రాల్లో వారిని చూసేందుకు అనుమతించం

విదేశాల నుంచి వచ్చేవారికి తగిన ముందస్తు పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ బాధితులు కారని నిర్ధారించాకే పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్ (నిర్బంధ వైద్య సేవలు) సెంటర్లకు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు రావద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. 

బాధితులను పరామర్శించడానికి వచ్చే వారివల్ల వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉన్నందున వారిని చూసేందుకు కూడా ఎవరినీ అనుమతించమని చెప్పారు. 'మీరు వచ్చి వారిని చూస్తే సమాజాన్ని ప్రమాదంలో పడేసిన వారవుతారు. అందువల్ల మా మాట వినండి. కాదని వస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడం' అని సీపీ తీవ్రంగా హెచ్చరించారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న తమ వారి కోసం 104కు కాల్ చేయాలని సూచించారు.



More Telugu News