'ఎఫ్ 3' కథపై కసరత్తు చేస్తున్న అనిల్ రావిపూడి

'ఎఫ్ 3' కథపై కసరత్తు చేస్తున్న అనిల్ రావిపూడి
  • దర్శకుడిగా అనిల్ రావిపూడి మార్క్ ప్రత్యేకం 
  • కథలో హాస్యానికి తొలి ప్రాధాన్యత 
  •  అరకులో 'ఎఫ్ 3' స్క్రిప్ట్ పనులు 
తెలుగులో వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా వున్నాడు. హాస్యానికి ప్రాధాన్యతినిస్తూ, యాక్షన్ .. ఎమోషన్ పాళ్లను కూడా కలుపుతూ ప్రేక్షకులను అలరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన కథను సిద్ధం చేసుకునే తీరు .. కథనాన్ని ఆసక్తికరంగా మలచుకునే విధానం పెర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆయన గత చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకోసం ఆయన విశాఖలో మకాం పెట్టాడట. విశాఖలోని ఒక స్టార్ హోటల్లో తన టీమ్ తో కలిసి ఉంటూ, అరకు వెళ్లి అక్కడ స్క్రిప్ట్ పనులను చక్కబెడుతూ వస్తున్నాడని అంటున్నారు. అరకు అందాల మధ్య అయితే స్క్రిప్ట్ మరింత బాగా వస్తుందనేది ఆయన భావన. 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలోను వెంకటేశ్ - వరుణ్ తేజ్ నటించనున్నారు.


More Telugu News