ఉమ్మితే వెయ్యి జరిమానా.. బీఎంసీ కఠిన నిర్ణయం

  • కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం 
  • ఆదేశాలు జారీ చేసిన ముంబై మునిసిపల్ కార్పొరేషన్
  • తొలి రోజు 107 మంది నుంచి రూ.1.07 లక్షల వసూలు
ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారికి  వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది.

 ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన బీఎంసీ.. తొలి రోజు ఏకంగా 107 మందిని గుర్తించి వారి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా వసూలు చేసింది. వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని బీఎంసీ కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా పరిశుభ్రత పాటించాలని, ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, 189 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని బీఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News