ఖైరతాబాద్‌లో వ్యభిచార గృహంపై దాడి.. జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

  • సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న పవన్, కిరణ్
  • సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారులు
  • వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం
హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్‌లో ఓ వ్యభిచార గృహంపై దాడిచేసిన పోలీసులు జూనియర్ ఆర్టిస్టును అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కిరణ్, అశ్వారావుపేటకు చెందిన ఇంటి పవన్‌ (24)లు తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ అర్టిస్టులుగా పనిచేస్తున్నారు.

 జూనియర్ ఆర్టిస్టుగా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకున్నారు. ఖైరతాబాద్ రాజ్‌నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేసి పవన్‌ను అరెస్ట్ చేశారు. కిరణ్ పరారయ్యాడు. అరెస్ట్ చేసిన పవన్ నుంచి మొబైల్ ఫోన్, రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  


More Telugu News