ఇటలీలో కరోనా తుపాన్.. ఒక్క రోజులో 475 మంది బలి!

ఇటలీలో కరోనా తుపాన్.. ఒక్క రోజులో 475 మంది బలి!
  • చైనాలో ఈ స్థాయిలో నమోదు కాని మరణాలు
  • ఇటలీలో 2,978కి చేరుకున్న మృతుల సంఖ్య
  • ప్రపంచవ్యాప్తంగా 8 వేల మందికిపైగా మృతి
చైనాలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 ఇప్పుడు ఇటలీని కుదిపేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 475 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా మరణాలతో కలిపి ఇటలీలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,978కి చేరుకుంది.  బాధితుల సంఖ్య 35,713కు చేరుకుంది.

ఇక, కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మరోవైపు, కరోనా వైరస్‌పై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. దేశంలో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని వివరించింది. వూహాన్, హుబేయి ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది.


More Telugu News