ఇరాన్‌లోని 255 మంది భారతీయులకు కరోనా.. ప్రకటించిన కేంద్రం
- లోక్‌సభకు తెలిపిన మంత్రి వి.మురళీధరన్
- ఇరాన్‌లో మొత్తం 6 వేల మంది భారతీయులు
- 195 మంది జైసల్మేర్ వైద్యకేంద్రానికి తరలింపు
ఇరాన్‌లోని 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్టు కేంద్రం ప్రకటించింది. లోక్‌సభలో నిన్న ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ నిన్న లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇరాన్‌లో మొత్తం 6 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిలో 1100 మంది యాత్రికులని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 389 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. మిగతా వారిని కూడా తీసుకురావడంపై దృష్టిసారించినట్టు చెప్పారు.
కాగా, ఇరాన్ నుంచి వచ్చిన వారిలో 195 మందిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక వైద్య కేంద్రానికి తరలించారు. మరోవైపు, లడఖ్ రెజిమెంటుకు చెందిన 34 ఏళ్ల సైనికుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన సైనికాధికారులు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను రద్దు చేశారు.