కరోనా భయంతో ఆసుపత్రి నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య!
- స్క్రీనింగ్ పరీక్షల్లో బయటపడిన కరోనా లక్షణాలు
- సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలింపు
- ఒత్తిడి భరించలేక ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న భయంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ వ్యక్తి తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. స్క్రీనింగ్ పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఓ వ్యక్తిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఏడో అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంతో ఒత్తిడికి గురైన సదరు వ్యక్తి తాను చికిత్స పొందుతున్న వార్డు నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.