రిలయన్స్ దుకాణాలపై దాడి, తుని రైలు దహనం కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
- వైఎస్ మృతి అనంతరం రిలయన్స్ దుకాణాలపై దాడి కేసులు
- తుని రైలు దహనం, కాపు ఉద్యమం నాటి 51 కేసులు కూడా
- ఈ మేరకు ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేశారు. ఈ మేరకు ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రిలయన్స్ దుకాణాలపై జరిగిన దాడులకు సంబంధించి అనంతపురం, గుంటూరు, ఇతర జిల్లాల్లో నమోదైన కేసులను ఎత్తివేశారు. అదే విధంగా, నాడు కాపు ఉద్యమం సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన కేసులను, తునిలో జరిగిన రైలు దహనం కారణంగా నమోదైన మొత్తం 51 కేసులను ఎత్తివేశారు.