ఎస్ఈసీ రమేశ్ కుమార్ కు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాలి: కన్నా లక్ష్మీ నారాయణ
- కేంద్ర మంత్రి అమిత్ షా కు కన్నా లేఖ
- నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు
- రమేశ్ కుమార్ పై జగన్ సహా వైసీపీ నేతలు మాటల దాడి చేశారు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఓ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల సాయంతో వైసీపీ నేతలు హింస, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇరవై ఐదు శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు.
గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఏపీలో పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని, ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ సహా అధికార పార్టీ నేతల మాటల దాడి గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. ఎస్ఈసీని అభ్యంతరకరమైన, అసభ్య పదజాలంతో వారు దూషించారని, ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఈ లేఖలో కన్నా అభిప్రాయపడ్డారు.