‘సుప్రీం‘ తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు: చంద్రబాబునాయుడు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు?
  • సభ్యత, సంస్కారం లేని వ్యక్తులు వైసీపీ నేతలు
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించే వారిని ఏమనాలి? అని ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం లేని వ్యక్తులు వీళ్లంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ‘కరోనా’ వ్యాప్తి చెందడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎస్ఈసీ తీసుకుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణా చర్యలు చేపట్టమని ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.


More Telugu News