కరోనా హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా.. సీఏఏకు వ్యతిరేకంగా 5 వేల మంది ఆందోళన!

  • చెన్నైలోని చేపాక్ ప్రాంతంలో సీఏఏ ఆందోళనకారుల నిరసనలు
  • సీఏఏను విరమించుకోవాలని నినాదాలు
  • చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆందోళన
కరోనా రక్కసి ప్రబలుతున్న తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా సీఏఏ నిరసనకారులు పట్టించుకోలేదు. చెన్నై వీధుల్లో దాదాపు 5వేల మంది సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చేపాక్ ప్రాంతంలో వీరు నినాదాలు చేశారు. నిరసనకారులంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారు. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వీరు నిరసనలు చేపట్టారు. వీరు చేపట్టిన నిరసనల పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదని అంటున్నారు.


More Telugu News