సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరైనా స్వీకరించాల్సిందే: బీజేపీ ఎంపీ జీవీఎల్
- స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పిటిషన్ పై సుప్రీం తీర్పు
- దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్
- ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలనే ‘సుప్రీం’ చాటిచెప్పింది
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీం కోర్టు సమర్థించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఢిల్లీలో తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరైనా స్వీకరించాల్సిందేనని అన్నారు. ఆర్టికల్ 243 k ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలనే సుప్రీంకోర్టు చాటిచెప్పిందని అన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డ కారణంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆపేందుకు వీలు లేదని, వాటిని కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రభుత్వంతోనూ చర్చించి ఉంటే బాగుండేదనే సూచనను సుప్రీంకోర్టు చేసిందని గుర్తుచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘బీజేపీ–జనసేన’ కలిసే పోటీ చేస్తాయని, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సరైన సమయంలో ఎన్నికల ప్రణాళిక గురించి రెండు పార్టీలు ముందుకెళతాయని అన్నారు. కరోనా’ నేపథ్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయమని చెప్పారు.