ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లేకపోతే ఈ చాంపియన్ షిప్ కు అర్థమే లేదు: వకార్ యూనిస్
- భారత్-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ కు ఐసీసీ చొరవ చూపాలి
- రెండు జట్ల మధ్య సిరీస్ లేకపోతే టెస్ట్ చాంపియన్ షిప్ కు విలువ ఉండదు
- 2007 నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగలేదు
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య టెస్ట్ సిరీస్ జరిగేలా ఐసీసీ చొరవ తీసుకోవాలని... లేకపోతే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్థమే ఉండదని పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అన్నారు. పాకిస్థాన్, భారత్ ల మధ్య ప్రస్తుత సంబంధాలు ఎలా ఉన్నాయో తనకు తెలుసని... ఈ నేపథ్యంలో ఐసీసీ చొరవ తీసుకోవాలని చెప్పారు.
ఐసీసీ ఈ విషయంలో కలగజేసుకోవాలని... ఎందుకంటే పాక్, ఇండియాలు తలపడకుండా ఉంటే చాంపియన్ షిప్ కు విలువ ఉండదని వకార్ అన్నారు. 2007 నుంచి ఇరు దేశాల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగలేదని చెప్పారు. తాను ఇండియాతో జరిగిన మ్యాచ్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశానని... అందుకే ఆ మ్యాచ్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఇండియాతో తొలి టెస్ట్ ఆడటాన్ని మర్చిపోలేనని చెప్పాడు.
టెస్ట్ చాంపియన్ షిప్ రూల్స్ ప్రకారం... టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లు కూడా కేవలం ఆరు జట్లతోనే తలపడతాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ పోరులో టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం ఉండదు. 2019 ఆగస్టు 1న టెస్ట్ చాంపియన్ షిప్ ప్రారంభమయింది. 2021 జూన్ 10 నుంచి 14 వరకు ఫైనల్స్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఇండియాలు ఫైనల్స్ కు చేరితేనే... ఒకరితో మరొకరు తలపడే అవకాశం ఉంటుంది.