ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం: శారదా పీఠం ఉత్తరాధికారి
- పాప గ్రహాల శక్తి పుంజుకుంది
- ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందే అవకాశముందన్న స్వాత్మానందేంద్ర
- కరోనా తొలగిపోవాలని కాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక హోమాలు
వచ్చే నెల రెండో తేదీ నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. పాప గ్రహాల శక్తి పుంజుకోవడంతో పాటు రాహువు దృష్టి గ్రహాల మీద పడిందని, అందుకే దేశంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 23వ వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని తెలిపారు.
కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో స్వాత్మానందేంద్ర ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం గణపతి పూజతో దీన్ని ప్రారంభించారు. ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజల పాటు కొనసాగనున్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని స్వాత్మానందేంద్ర తెలిపారు. సామాజిక స్పృహతో వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు. శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీదప్రభావం ఉందన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని చెప్పారు. అందుకే విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది పాల్గొంటున్నారని చెప్పారు.