ఏపీ ఉద్యోగులను అడ్డుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

  • 584 మంది ఉద్యోగులు ఏపీ నుంచి రిలీవ్‌ 
  • తెలంగాణ కార్యాలయాల్లో చేరడానికి వస్తోన్న ఉద్యోగులు
  • రానివ్వని తెలంగాణ ఉద్యోగులు
విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు 584 మంది ఉద్యోగులను ఏపీ నుంచి రిలీవ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారంతా తెలంగాణలోని విద్యుత్‌ సంస్థల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.

అయితే, వారిని తెలంగాణ విద్యుత్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ కార్యాలయాల్లో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరేందుకు ఈ రోజు కూడా కొంత మంది ఏపీ ఉద్యోగులు వచ్చారు. వారిని అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థ కార్యాలయాల్లోకి వారిని వెళ్లనివ్వట్లేదు. దీంతో విద్యుత్‌ సౌధతో పాటు మింట్‌కాంపౌండ్‌లోని డిస్కంల ప్రధాన కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ కార్యాలయాల ప్రధాన గేట్ల ముందు పోలీసులు మోహరించారు.


More Telugu News