రేవంత్ రెడ్డి విషయంలో సభా హక్కుల ఉల్లంఘన: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • చిన్న చిన్న కేసుల్లో ఇన్ని రోజులు జైల్లోనా 
  • ఇప్పటికే లోక్ సభ స్పీకర్ దృష్టికి సమస్య 
  • ఈరోజు కేంద్ర హోంమంత్రిని కలుస్తామని వెల్లడి

ఒక పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ రెడ్డికి ఉన్న హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తూ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఉత్తమకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఒక ఎంపీని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అన్యాయమన్నారు.

ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రేవంత్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఇప్పటికే లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఇవాళ మరోసారి కలిసి ప్రివిలైజెస్ కమిటీకి పంపాలని కోరనున్నట్లు తెలిపారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి సమస్య వివరిస్తామన్నారు. ఎంపీకే పౌరహక్కులు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.



More Telugu News