'కొండవీటి దొంగ' ఫ్లాప్ అనే ప్రచారం జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ
- 'కొండవీటి దొంగ' విషయంలో అసత్య ప్రచారం
- ఎన్నో సెంటర్స్ లో 100 రోజులు ఆడింది
- అప్పట్లో అలా ఉండేదన్న పరుచూరి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'కొండవీటి దొంగ' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'కొండవీటి దొంగ' విడుదలైంది. అంతకుముందు వచ్చిన 'స్టేట్ రౌడీ' సినిమా ఫ్లాప్ అంటూ కొంతమంది ఎలా ప్రచారం చేశారో, 'కొండవీటి దొంగ' విషయంలోను అలాగే ప్రచారం చేశారు.
వేరే సినిమా షూటింగు కోసం రాజమండ్రి వెళ్లిన నేను, అక్కడ హిట్ టాక్ గురించి విని చిరంజీవిగారికి చెప్పాను. ఆ సినిమా విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని గురించి ఆయన కూడా ప్రస్తావించారు. ఆ సినిమా ఎన్ని సెంటర్స్ లో 100 రోజులు ఆడిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఒక కథను రాయడం ఒక ఎత్తయితే .. హీరో హీరోయిన్లను ఒప్పించడం ఒక ఎత్తయితే .. ఆ సినిమా బాగుందని ఆడియన్స్ ను నమ్మించడం కూడా ఒక ఎత్తుగా ఉండేది. 100 రోజుల ఫంక్షన్ చేసినప్పుడుగానీ నమ్మేవారు కాదు" అని చెప్పుకొచ్చారు.