విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కరణ్ జొహార్

  • ఫ్లాప్ అయిన 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • ఇటీవలే చూసిన కరణ్ జొహార్
  • కథ పట్ల ఆసక్తిని చూపుతున్న వైనం  
విజయ్ దేవరకొండ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగతా కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.

ఇప్పుడు కరణ్ జొహార్ ఈ సినిమానే హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. రీసెంట్ గా కరణ్ జొహార్ ఈ సినిమాను చూశాడట. ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వలన, హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. అందువలన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. మూడు ట్రాకుల్లో .. నలుగురు హీరోయిన్స్ తో సాగుతుంది గనుక, ఈ కథ నిజంగానే హిందీ ఆడియన్స్ కి నచ్చుతుందేమో చూడాలి.


More Telugu News