దిగ్విజయ్ సింగ్ ను అడ్డుకున్న కర్ణాటక పోలీసులు... రోడ్డుపై బైఠాయించి నిరసన!
- బెంగళూరులో మకాం వేసిన ఎమ్మెల్యేలు
- కలిసేందుకు వెళ్లిన దిగ్విజయ్ సింగ్
- బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు
బెంగళూరులోని ఓ హోటల్ లో మకాం వేసిన మధ్యప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఆపై ఆయన ఇతర నేతలతో కలిసి రోడ్డుపైనే టీ తాగారు.
కాగా, తన వర్గం ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయగా, ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి వుండగా, కరోనా ఎఫెక్ట్ తో కమల్ నాథ్ సర్కారు తాత్కాలికంగా బయటపడింది.