టోక్యో ఒలింపిక్స్ డౌటే!... జపాన్ ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడికి కరోనా
- కోజో తాషిమాకు కరోనా పాజిటివ్
- ఇటీవలే యూరప్ వెళ్లొచ్చిన తాషిమా
- జూలైలో జరగాల్సిన ఒలింపిక్స్
- రీషెడ్యూల్ చేయాలంటూ ప్రతిపాదన
కరోనా వైరస్ ఎవర్నీ వదలడంలేదు! తాజాగా జపాన్ ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు కోజో తాషిమా కరోనా మహమ్మారి బారినపడ్డారు. జ్వరంతో బాధపడుతున్న తాషిమాకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జపాన్ ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న తాషిమా వయసు 62 సంవత్సరాలు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి చివరివారంలో, మార్చి మొదటివారంలో యూరప్ లో జరిగిన రెండు సమావేశాల్లో తాషిమా పాల్గొన్నారు. ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.
జపాన్ ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడే కరోనా బాధితుల జాబితాలో చేరిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమాన మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. ఈ వేసవి తర్వాత జూలై 24 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కరోనా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ ను సైతం వాయిదా వేయాలంటూ ప్రతిపాదనలు వస్తున్నాయి.