రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా తప్పుడు సమాచారం అందిస్తున్నారు: అచ్చెన్నాయుడు
- ఏపీ విద్యార్థులు అనేక దేశాల్లో చిక్కుకుపోయారన్న అచ్చెన్న
- విద్యార్థుల కోసం ఏం చేశారంటూ సర్కారుపై ఫైర్
- కరోనా ప్రభావం కనిపించడం లేదా? అంటూ మండిపాటు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర విద్యార్థులు అనేక దేశాల్లో చిక్కుకుపోయారని మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ విద్యార్థులు కౌలాలంపూర్ లో చిక్కుకుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు కరోనా ప్రభావం కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజల ప్రాణాలపై శ్రద్ధ వహించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కుల జపం మాని కరోనా నివారణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.