ఏపీలో ‘స్థానిక’ ఎన్నికలు రద్దు చేయాలని కోరిన రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా

  • కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన మంత్రి కార్యాలయంకు విజ్ఞప్తి
  • అథవాలేను కలిసిన ఆర్పీఐ ఏపీ నేత శివనాగేశ్వరరావు
  • ‘కరోనా’ ప్రభావం తగ్గాకే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలని కోరాం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు విజ్ఞప్తి చేసింది. ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు అథవాలేను పార్టీ ఏపీ కన్వీనర్ శివనాగేశ్వరరావు కలిశారు. అనంతరం, మీడియాతో శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏపీలో ప్రస్తుత పరిస్థితి గురించి అథవాలేకు వివరించినట్టు చెప్పారు. ‘కరోనా’ ప్రభావం తగ్గాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరామని అన్నారు. 127 జెడ్పీటీసీలు, 250 ఎంపీటీసీలను అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని, ఏకగ్రీవమైన స్థానాలను రద్దు చేయాలని కోరామని చెప్పారు. 


More Telugu News