బుల్లెట్ బండి బీఎస్-6 సోయగం చూడండి!

  • ఈ నెలాఖర్లో రానున్న బీఎస్-6 బుల్లెట్
  • ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.1.27 లక్షలు
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ సదుపాయానికి అదనపు ధర
అప్పటికీ ఇప్పటికీ మోటార్ సైకిల్ రంగంలో బుల్లెట్ ను మించింది లేదని చెబుతుంటారు. దశాబ్దాల తరబడి చరిత్ర ఉన్న ఈ భారీ మోటార్ సైకిల్ నేటి యువతను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తయారుచేసే బుల్లెట్ బైక్ ఠీవి మరే బైక్ కు లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం.

 ఇక  దేశంలో ఎక్కడ చూసినా బీఎస్-6 కోలాహలం కనిపిస్తోంది. బీఎస్-4 వాహనాలకు ఈ నెల 31 తర్వాత రిజిస్ట్రేషన్లు చేయరన్న నేపథ్యంలో అన్ని ద్విచక్రవాహన కంపెనీలు, కార్ల తయారీదార్లు బీఎస్-6 మోడళ్లు తెస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా తన బుల్లెట్ ను మరింత ఆధునికీకరించి బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దింది.

350 సీసీ విభాగంలో ఈ బైక్ ను ఈ నెలాఖర్లో మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. బీఎస్-6 బుల్లెట్ ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఎలక్ట్రిక్ స్టార్ట్ సౌకర్యంతో రూ.1.37 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. డిజైన్ పరంగా బీఎస్-4 బుల్లెట్ కు, బీఎస్-6 మోడల్ కు తేడా కనిపించదు కానీ ఇంజిన్ ను మాత్రం అప్ డేట్ చేశారు. అయితే, ఇప్పుడున్న రంగులకు అదనంగా మరిన్ని రంగుల్లో ఈ బీఎస్-6 బుల్లెట్ ను తీసుకువస్తున్నారని మార్కెట్ వర్గాలంటున్నాయి.


More Telugu News