చంద్రబాబు మెప్పు కోసమే ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది: మంత్రి వెల్లంపల్లి
- ఎన్నికల వాయిదా ముందు ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించలేదు
- ప్రజల మనోభావాలను తెలుసుకుని ఈసీ ముందుకెళ్లాలి
- ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీదే విజయం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేముందు ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించలేదని, చంద్రబాబు మెప్పు కోసమే ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల మనోభావాలను తెలుసుకుని ఈసీ ముందుకెళ్లాలని సూచించారు. ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజల చేత తిరస్కరించబడ్డ వ్యక్తి యనమల అని, ఆయన హయాంలో అవలంబించిన ఆర్థిక విధానాలతో రాష్ట్రం చాలా నష్టపోయిందని విమర్శించారు.