పోలీసుల తీరును నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించిన కమలహాసన్
- ఇండియన్-2 సెట్స్ పై ప్రమాదంలో ముగ్గురి మృతి
- కమల్ కు నోటీసులు పంపిన సీబీసీఐడీ పోలీసులు
- పోలీసులు వేధిస్తున్నారంటూ కమల్ ఆరోపణ
ఇటీవల ఇండియన్-2 చిత్రం షూటింగ్ లో క్రేన్ ప్రమాద ఘటనకు సంబంధించి నటుడు కమలహాసన్ కు సీబీసీఐడీ పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై కమల్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కమల్ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కమల్, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రం చెన్నై శివార్లలో షూటింగ్ జరుపుకుంటుండగా, సెట్స్ పై భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ మరణించారు. ఈ వ్యవహారంలో దర్శకుడు శంకర్ కు కూడా పోలీసులు నోటీసులు పంపారు.