యువ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్న మహేశ్ బాబు
- అనిల్ రావిపూడి నుంచి హిట్ అందుకున్న మహేశ్
- తదుపరి అవకాశం పరశురామ్ కి
- 'భీష్మ' దర్శకుడికి ఛాన్స్
మహేశ్ బాబు నిన్నమొన్నటి వరకూ సక్సెస్ లతో వున్న సీనియర్ దర్శకులతో కలిసి పని చేయడానికే ఆసక్తిని చూపుతూ వచ్చాడు. తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్లీ అవకాశాలనిస్తూ వచ్చాడు. అలాంటి మహేశ్ బాబు ఇటీవల తన మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. కొత్తదనంతో కూడిన కథాకథనాలతో వస్తున్న యువ దర్శకులకు కూడా ఆయన అవకాశాలనిస్తూ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు అనిల్ రావిపూడితో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' మంచి ఫలితాన్ని రాబట్టింది. దాంతో యువ దర్శకుల వైపే మహేశ్ బాబు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత సినిమాను వెంకీ కుడుములతో చేసే అవకాశాలు ఉన్నాయనేది తాజా సమాచారం. 'ఛలో'.. 'భీష్మ' హిట్లతో పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములను, మంచి కథతో రమ్మని మహేశ్ బాబు చెప్పాడట. దాంతో ఆయన అదే పనిలో ఉన్నాడని అంటున్నారు.