యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మరోసారి అనుష్క
- అనుష్క నుంచి రానున్న 'నిశ్శబ్దం'
- మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సన్నాహాలు
- గతంలో హిట్ కొట్టిన 'భాగమతి'
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. నాయికా ప్రాధాన్యత గల సినిమాలకి అనుష్క ఇప్పుడు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఆమె ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన 'నిశ్శబ్దం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ హోమ్ బ్యానర్ అన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్లో గతంలో అనుష్క చేసిన 'భాగమతి' భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు అనుష్కతో మరో సినిమాను నిర్మించడానికి వాళ్లు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.