పాకిస్థాన్‌లో తొలి కరోనా మరణం!

  • ఇరాన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్‌
  • లాహోర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతి
  • పాక్‌లో ఇప్పటిదాకా 189 మందికి కరోనా పాజిటివ్‌
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన పొరుగు దేశం పాకిస్థాన్‌ను కూడా వణికిస్తోంది. పాక్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో లాహోర్‌‌లోని మయో ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

కాగా, పాకిస్థాన్‌లో ఇప్పటిదాకా 189 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డాన్‌ పత్రిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 80 వేల మందికి ఈ ప్రాణాంతక వైరస్‌ సోకగా.. ఇప్పటికే ఏడు వేల మందికిపైగా మరణించారు.


More Telugu News