భారత్ లో కరోనా రెండో దశకు చేరుకుంది: భారత వైద్యపరిశోధన మండలి

  • భారత్ లో కరోనా ఉద్ధృతి
  • 126కి చేరిన బాధితులు
  • కరోనా ఇంకా సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదన్న ఐసీఎంఆర్
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ భారత్ లోనూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 126 కాగా, ముగ్గురు మృతి చెందారు. వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తతతో అనేకమంది ప్రముఖులు స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పరిస్థితిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పందించింది.

భారత్ లో కరోనా రెండో దశకు చేరుకుందని, ఇంకా సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతానికి కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులవుతున్నారని తెలిపింది. ఈ దశలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరంలేదని ఐసీఎంఆర్ వర్గాలు వివరించాయి.


More Telugu News