మహారాష్ట్రలో కరోనా అనుమానితుల ఎడమ చేతిపై ఇలా స్టాంపులు!

  • 'ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను' అని రాసిఉన్న స్టాంపులు
  • అనుమానితులను సులువుగా గుర్తించవచ్చని నిర్ణయం
  • ఎడమ అరచేతి వెనుక భాగంలో స్టాంపులు
కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల చేతులపై స్టాంపులు వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'ముంబయి వాసులను రక్షిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను' అన్న వ్యాఖ్య వుంటుంది. అలాగే, కరోనా అనుమానితులు ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలి అనే సమాచారం కూడా అందులో వుంటుంది.

ఇలా చేస్తే కరోనా అనుమానితులను గుర్తించటం సులువవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే అభిప్రాయపడ్డారు. అలాగే, సాధారణ ప్రజలతో కలవకుండా వారిని నిరోధించవచ్చని చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఏడుగురు కరోనా అనుమానితులు చికిత్సా కేంద్రాల నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి ఉద్ధవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా అనుమానితులకు ఎడమ అరచేతి వెనుక భాగంలో ఈ స్టాంపులు వేయాలని భావిస్తున్నారు.  


More Telugu News