కరోనా వైరస్‌పై ఎంపీలకు ప్రధాని మోదీ ఆదేశాలు
- ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- కరోనాపై స్పందించిన ప్రధాని
- ఎంపీలు తమ నియోజక వర్గాల్లో పర్యటించాలని పిలుపు
- జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచన
ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో కరోనా వైరస్ ప్రభావంపై కూడా పలువురు నేతలు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై మాట్లాడుతూ ఎంపీలకు పలు సూచనలు చేశారు.
ప్రతి బీజేపీ ఎంపీ తమ నియోజక వర్గాల్లో పర్యటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటికి కరోనా సోకిన వారి సంఖ్య 129కి చేరింది.