రామ్ చరణ్ గెటప్స్ పై పెయింటింగ్ పోటీలు

  • విభిన్నమైన పాత్రలలో నటించిన చరణ్ 
  • ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు
  • ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రకళా పోటీలు  
రామ్ చరణ్ మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ప్రతి సినిమాలోను ఆయన తన లుక్ కి ప్రాధాన్యతనిచ్చాడు. అందువలన ఆయన లుక్ చూడగానే అది ఏ సినిమాకి సంబంధించినది అనే విషయాన్ని ఆయన అభిమానులు వెంటనే పసిగట్టేస్తారు. అలాంటి అభిమానుల్లో చిత్రకారులుంటే, వాళ్లకి అదృష్టం కలిసొచ్చినట్టే.

అఖిల భారత చిరంజీవి యువత వారు, చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రకళా పోటీలు నిర్వహించతలపెట్టారు. ఈ పోటీల్లో చరణ్ గెటప్స్ ను మాత్రమే గీయవలసి ఉంటుంది. చరణ్ ధరించిన వివిధ పాత్రలలో, అభిమానులు తమకి నచ్చిన పాత్రలను తీసుకుని .. ఆ రూపాలను చిత్రీకరించవలసి ఉంటుంది. అలా చరణ్ వేషధారణకి సంబంధించిన చిత్రాలను గీసి, ramcharanbirthday@yahoo.com అనే ఈ మెయిల్ ఐడీకి పంపించవలసి ఉంటుంది. ఉత్తమ పెయింటింగ్ ను ఎంపిక చేసి .. దానిని చిత్రీకరించినవారికి చిరు సత్కారం ఉంటుందని తెలియజేశారు.


More Telugu News