దేశంలో కరోనాతో మరొకరి మృతి

  • దేశంలో ఇప్పటికే ఇద్దరు మృతి 
  • మహారాష్ట్రలో మూడో మరణం
  • మహారాష్ట్ర సర్కారు మరింత అప్రమత్తం  
దేశంలో కరోనా వైరస్‌తో మరొకరు మృతి చెందారు. ఈ వైరస్‌ కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (64) ఈ రోజు మృతి చెందడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.

అతడు మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో మహారాష్ట్ర సర్కారు మరింత అప్రమత్తమైంది. అధికారులకు సీఎం ఉద్ధవ్‌ థాకక్రే పలు ఆదేశాలు ఇచ్చారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.


More Telugu News