టాయిలెట్ పేపర్లు దోచుకుంటున్నారట.. అమెరికాలో తుపాకులకు పెరిగిన గిరాకీ!

  • కరోనా భయంతో ఇళ్ల నుంచి బయటకు రాని ప్రజలు
  • పెద్ద ఎత్తున టాయిలెట్ పేపర్ల కొనుగోళ్లు 
  • వాటిని రక్షించుకునేందుకు తుపాకులు
అమెరికాను కరోనా భయం కుదిపేస్తోంది. ఈ మహమ్మారికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఫలితంగా టాయిలెట్ పేపర్లు గుట్టలుగుట్టలుగా కొనుక్కుని భద్రపరుచుకుంటున్నారు. ఫలితంగా ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది.

వాటిని భద్రపరుచుకునేందుకు తుపాకులు కొనుక్కుంటున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ రాష్ట్రాల ప్రజలు తుపాకుల కోసం బారులు తీరుతున్నారు. తాను ఏకంగా 1500 డాలర్లు పెట్టి ఒక తుపాకి, తూటాలు కొన్నట్టు మిలటరీ మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు తన కుటుంబం సురక్షితంగా ఉందని ఆయన పేర్కొనడం అక్కడి ప్రజల భయానికి అద్దం పడుతోంది.


More Telugu News