అలా ఆ కథ నా దగ్గరికి వచ్చింది: యాంకర్ ప్రదీప్
- అమలాపురం మా సొంత ఊరు
- యాంకర్ గా ప్రేక్షకులు ఆదరించారు
- దర్శకుడు నన్ను ఎంచుకోవడానికి కారణమదేనన్న ప్రదీప్
బుల్లితెరపై యాంకర్ గా .. హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ కారణంగా ఆయనకి సినిమాల్లోను అవకాశాలు వచ్చాయి. అలా ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.
తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .."అమలాపురం మా సొంత ఊరు .. నేను పుట్టింది అక్కడే అయినా, పెరిగింది హైదరాబాదులోనే. యాంకర్ గా ప్రేక్షకులు ఆదరించడం వలన హీరోనయ్యాను. నిజానికి ఈ కథను దర్శకుడు మున్నా నా కోసం రాయలేదు. ఆయన కథను సిద్ధం చేసుకున్న తరువాత, తన ఇంట్లో టీవీలో వస్తున్న నా ప్రోగ్రామ్ చూస్తూ ఆయన తల్లీ .. భార్య అదే పనిగా నవ్వుతున్నారట. ఈ సినిమా కథలో ఆడవాళ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం వలన, ఆ సబ్జెక్ట్ ను నా ద్వారా చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నన్ను ఎంచుకున్నాడు. అలా ఆ కథ నా దగ్గరికి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.