మూడు రాజధానుల అంశంపై.. టీడీపీ ఎంపీ కనకమేడల లేఖకు ప్రధాని జవాబు!

  • ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోవాలంటూ లేఖ
  • శాసనమండలి రద్దు అంశం కూడా ప్రస్తావన
  • అడ్డుకోకుంటే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన
ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాసిన లేఖపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. మీరు రాసిన లేఖ తనకు అందినట్టుగా ప్రధాని జవాబిచ్చారు. మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మోదీకి రాసిన లేఖలో కనకమేడల ఆవేదన వ్యక్తం చేశారు. 13 జిల్లాలు ఉన్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులను అంగీకరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చూడాలని అందులో కోరారు.

విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఇప్పటికే ఖరారైందన్నారు.  తన పరిధిలో లేని అంశంపై జోక్యం చేసుకుంటున్న ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, లేదంటే మొత్తం దేశంపైనే దుష్ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, శాసనమండలి రద్దు అంశాన్ని కూడా కనకమేడల ప్రస్తావించారు. కనకమేడల రాసిన లేఖకు ప్రధాని స్పందించారు. ‘‘ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మీరు రాసిన లేఖ నాకు అందింది’’ అని కనకమేడలకు మోదీ లేఖ రాశారు.


More Telugu News