రేపటి లోగా బలపరీక్ష నిర్వహించండి.. కమల్ నాథ్ కు గవర్నర్ ఆదేశం
- అనిశ్చితిలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు
- కరోనా కారణంగా మార్చి 26 వరకు వాయిదా పడిన అసెంబ్లీ
- అయినా సరే మంగళవారం బలనిరూపణ చేయాల్సిందేనన్న గవర్నర్
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారుకు మరో ముప్పు వచ్చిపడింది. తాజాగా రేపటిలోగా బలనిరూపణ చేసుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్ లాల్ జీ టాండన్ ఆదేశించారు. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు మార్చి 26 వరకు వాయిదా పడగా, అప్పటివరకు ప్రమాదమేమీ లేదనుకున్న కమల్ నాథ్ సర్కారుకు గవర్నర్ తాజా ఆదేశాలు పెనువిఘాతంలా పరిణమించాయి.
మంగళవారంలోగా బలం నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం మైనారిటీలో పడినట్టుగా భావించాల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేయడంతో కమల్ నాథ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ శిబిరంలో తాజా పరిణామాలు హర్షం నింపాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరోనా కూడా కాపాడలేదని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.