ఆదిత్య ధర్, మధు సి నారాయణన్ లకు గొల్లపూడి జాతీయ అవార్డు

  • ప్రతి ఏటా గొల్లపూడి శ్రీనివాస్ పేరిట అవార్డులు
  • ఉరి సినిమాతో ప్రతిభ చాటుకున్న ఆదిత్య ధర్
  • కుంబలంగి నైట్స్ తో మధు సి నారాయణన్ కు గుర్తింపు
బాలీవుడ్ చిత్రం 'ఉరి' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమా అయినా దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతంగా తెరకెక్కించాడు. మరోవైపు మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి అందరి ప్రశంసలు అందుకున్న చిత్రం 'కుంబలంగి నైట్స్'. ఈ సినిమాకు మధు సి నారాయణన్ దర్శకత్వం వహించాడు.

ఇప్పుడు ఆదిత్య ధర్, మధు సి నారాయణన్ లకు ప్రతిష్ఠాత్మక గొల్లపూడి శ్రీనివాస్ స్మారక జాతీయ అవార్డును ప్రకటించారు. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కేటగిరీలో వీరిద్దరికీ సంయుక్తంగా అవార్డు ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ స్మారకార్థం ఈ అవార్డు ఇస్తున్నారు. ఆగస్టు 12న గొల్లపూడి శ్రీనివాస్ వర్థంతి సందర్భంగా ఈ జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. కాగా, ఈ అవార్డు కోసం 22 నామినేషన్లు వచ్చినట్టు అవార్డు కమిటీ తెలిపింది.


More Telugu News