కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి: బండి సంజయ్

  • తెలంగాణ అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం
  • సీఏఏపై కేసీఆర్ కు సరైన అవగాహన లేదన్న బండి సంజయ్
  • సీఏఏ అంటే పౌరసత్వం ఇచ్చేదేనని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు.  సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం అంటే దేశద్రోహానికి పాల్పడడమేనని, సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్సీఆర్, ఎన్పీఆర్ లపై సరైన విషయ పరిజ్ఞానం లేకే సీఎం కేసీఆర్ వాటిని వ్యతిరేకిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సీఏఏ అంటే పౌరసత్వం ఇచ్చేదే తప్ప తొలగించేది కాదన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని శాసనసభలో ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. బర్త్ సర్టిఫికెట్ లేదంటున్న కేసీఆర్ ఇన్నాళ్లు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నాడో చెప్పాలని నిలదీశారు.


More Telugu News