కార్యకర్తలపై దాడిని బీజేపీ-జనసేన కూటమి తేలిగ్గా తీసుకోదని గుర్తుంచుకోండి: సునీల్ దేవధర్

  • తమ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారన్న దేవధర్
  • పోటీ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • కార్యకర్తలకు అండగా ఉంటామని ఉద్ఘాటన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ ఆరోపించారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీజేపీ-జనసేన కూటమి తేలిగ్గా తీసుకోదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు. "స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు ఆదేశించిన తర్వాత వైసీపీ గూండాలు బీజేపీ-జనసేన కార్యకర్తలపై దాడులకు ఉపక్రమించాయి. వారిని పోటీ చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు. ఇదే జగన్ నాడు టీడీపీ పాలన సందర్భంగా ప్రజాస్వామ్యం మంటగలుస్తోందంటూ గగ్గోలు పెట్టాడు" అంటూ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.


More Telugu News