తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పై చార్జీలు పెంచబోతున్నాం: సీఎం కేసీఆర్
- ‘తెలంగాణ’ను కష్టపడి సాధించుకున్నాం
- రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వదలం
- సుదీర్ఘంగా ఆలోచన చేసి బడ్జెట్ ను రూపొందించాం
టీ–కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ సెటైర్లు విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేయమని అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. సుదీర్ఘంగా ఆలోచన చేసి బడ్జెట్ ను రూపొందించామని, ఇరవై మూడు జిల్లాలు ఉన్న మునుపటి ఏపీకి సమానంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పై చార్జీలు పెంచబోతున్నామని, ఆర్టీసీకి బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించామని, ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఛార్జీలు పెంచామని చెప్పారు.