ఎన్నికలు వాయిదా పడితే కొంపలేమన్నా మునిగిపోతాయా?: సోమిరెడ్డి

  • ఎన్నికల విషయంలో ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి
  • కరోనా వల్ల రాష్ట్ర ప్రజలకు ముప్పు ఉండడంతో వాయిదా
  • పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని మమతా బెనర్జీ కోరారు 
  • జగన్‌ మాత్రం మరోలా మాట్లాడుతున్నారు 
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. 'ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ వాళ్లు పరిపాలిస్తున్నారా? నేను పరిపాలిస్తున్నానా? అంటున్నారు. ఎన్నికల విషయంలో ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి. కరోనా వల్ల రాష్ట్ర ప్రజలకు ముప్పు ఉండడంతో ఎన్నికలను వాయిదా వేశారు. పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. అన్ని పార్టీలు కోరాయి. ఇక్కడ జగన్‌ మాత్రం మరోలా మాట్లాడుతున్నారు' అని విమర్శించారు.

'అధికారులను ఈసీ ఎలా బదిలీ చేస్తుందని గగ్గోలు పెడుతున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఆ విషయం తెలియదా?..  రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు. కులాలు అంటగట్టడం దురదృష్టకరం.. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో..' అని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వాయిదా పడితే కొంపలేమన్నా మునిగిపోతాయా? అని ప్రశ్నించారు. 


More Telugu News