పుట్టపర్తిలో కరోనా కల్లోలం.. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు
- పుట్టపర్తికి వచ్చిన రష్యన్ వ్యక్తికి కరోనా లక్షణాలు
- ఐసొలేషన్ వార్డుకు తరలింపు
- సత్యసాయి సమాధిని తాకొద్దని భక్తులపై ఆంక్షలు
ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో కరోనా భయాందోళనలు పెరుగుతున్నాయి. అనునిత్యం ఎక్కడెక్కడి నుంచో సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యక్తి పుట్టపర్తికి వచ్చాడు. అతను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో స్థానిక ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో సత్యసాయి ట్రస్ట్ అప్రమత్తమైంది. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు విధించారు. సత్యసాయి సమాధిని భక్తులెవరూ తాకవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పుట్టపర్తిని సందర్శిస్తున్న విదేశీ భక్తులు, పర్యాటకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.