అరాచక శక్తుల విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోవడమే 'అమరజీవి'కి నిజమైన నివాళి: చంద్రబాబు
- పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చంద్రబాబు ట్వీట్
- రాజధాని ఉద్యమానికి ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం కావాలి
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
అరాచక శక్తుల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడమే అమరజీవి పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను చంద్రబాబు ప్రస్తావించారు.
'తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు. ఒకవైపు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు నిమ్నవర్గాల హక్కుల కోసం పోరాడి దళితులకు ఆలయ ప్రవేశం కలిగించిన సంఘసంస్కర్త శ్రీరాములుగారు' అని పేర్కొన్నారు.
'ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉద్యమానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం కావాలి. అరాచకశక్తుల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడమే ఆ అమరజీవికి నిజమైన నివాళి' అని ట్వీట్లు చేశారు.