మెగాస్టార్ చిరంజీవి చేశారేమో... మా వల్ల కాదు: రష్మీ గౌతమ్
- చాలామంది నిర్మాతల కాంట్రాక్టుల్లో ఉంటారు
- వారు చెబితేనే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది
- నన్ను ట్రోల్ చేయడం మాని ప్రజల్లో అవగాహన పెంచండి
- ట్విట్టర్ వేదికగా రష్మీ వ్యాఖ్యలు
కరోనా భయాలతో మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకోవచ్చేమోగానీ, తనవంటి చిన్న ఆర్టిస్టులు ఆ పని చేయలేరని యాంకర్, నటి రష్మీ గౌతమ్ వాపోయింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టింది. తామంతా ప్రొడక్షన్ హౌస్ లతో కాంట్రాక్టుల్లో ఉంటామని, ఆ ప్రొడక్షన్ హౌస్ క్యాన్సిల్ చేస్తేనే షూటింగ్ రద్దవుతుందని, లేకుంటే తాము విధిగా వెళ్లాల్సిందేనని చెప్పింది.
"అవును... నేను షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకోలేను. ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధిస్తేనే అది జరుగుతుంది. మా నటీనటుల్లో చాలా మంది నిర్మాతలకు చెందిన సంస్థల్లో కాంట్రాక్టుల్లో ఉంటారు. వారు షూటింగ్ ను వాయిదా వేయకుంటే మేము వెళ్లాల్సిందే" అని పేర్కొంది.
ఆపై "ఒకరితో ఒకరు యుద్ధం చేయడం ఆపండి. ఫ్యాన్స్ అంతా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలి. మీ కుటుంబాల్లో వైరస్ పట్ల అవగాహన పెంచండి. ఆ పని చేస్తే, వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. వైరస్ లక్షణాలున్న వారికి సాయపడండి. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. నన్ను ట్రోలింగ్ చేయడం వల్ల మీకేమీ లాభం ఉండదు" అని ట్వీట్ చేసింది. కాగా, కరోనాపై రష్మీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతోనే ఆమె ఇలా స్పందించినట్టు తెలుస్తోంది.