దేశ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ.. ప్రారంభించిన భీం ఆర్మీ చీఫ్

  • ఆజాద్ సమాజ్ పార్టీని ప్రారంభించిన చంద్రశేఖర్ ఆజాద్
  • కాన్షీరాం జయంతి సందర్భంగా పార్టీ ప్రారంభం
  • బీహార్ అసెంబ్లీ, యూపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ
భారత రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ వచ్చి చేరింది.‘ఆజాద్ సమాజ్ పార్టీ’ పేరుతో భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నిన్న పార్టీని ప్రారంభించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకుని నోయిడాలోని సఫాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రారంభించారు.

 నీలం రంగు మధ్యలో తెలుపు రంగుపై ఆజాద్ సమాజ్ పార్టీ అని రాసి ఉన్న పార్టీ జెండాను ఆజాద్ ఆవిష్కరించారు. పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాన్షీరాం చేపట్టిన మిషన్ అసంపూర్తిగా ఉందని, దానిని ఆజాద్ సమాజ్ పార్టీ పూర్తిచేస్తుందన్నారు. తమ పార్టీ దళితుల కోసం పోరాడుతుందన్నారు. ఈ ఏడాది చివరల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ, ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆజాద్ తెలిపారు.


More Telugu News