కరోనా కలకలంతో రెండు గంటలు ఆగిన ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’

  • రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు రష్యన్లు
  • వారు కరోనా బాధితులని తోటి ప్రయాణికుల అనుమానం
  • వారిలో ఆ లక్షణాలు లేవని నిర్ధారణ
రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీయుల కారణంగా ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’ అరగంటకు పైగా నిలిచిపోయింది. బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎ-5 కోచ్ బెర్త్ నంబరు 8, 10లలో ఇద్దరు రష్యన్లు ప్రయాణిస్తున్నారు. వారిని చూసిన తోటి ప్రయాణికులు అనుమానించారు. విదేశీయులు కావడంతో వారికి కరోనా సోకి ఉంటుందని భావించారు. వారి హంగామాతో పాట్నా స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది.

విషయం తెలిసిన రైలులోని వైద్య బృందం రష్యన్ల వద్దకు చేరుకుని పరీక్షలు నిర్వహించింది. వారిలో కరోనా లక్షణాలు లేవని నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రైలు గమ్యానికి బయలుదేరింది. రష్యన్లను చూసి వారిని కరోనా బాధితులుగా ప్రయాణికులు భావించారని, అయితే వారిలో కరోనా లక్షణాలు లేవని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.


More Telugu News