ఇన్నేళ్లలో ఈసీ గురించి ఎవరూ ఇలా మాట్లాడలేదు: కళా వెంకట్రావు
- ఈసీ పట్ల సీఎం మాటలు బాధాకరమన్న కళా వెంకట్రావు
- కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం సరికాదని హితవు
- ఇంత నీచ రాజకీయాలు ఏ రాష్ట్రంలో లేవన్న భూమా అఖిలప్రియ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. ఇన్నేళ్లలో ఎన్నికల కమిషనర్ గురించి ఎవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు. ఎన్నికల కమిషనర్ పట్ల సీఎం అనుచితంగా మాట్లాడడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
అటు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేకే వైసీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇంత నీచ రాజకీయాలు ఏ రాష్ట్రంలోనూ లేవని, టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.